తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో గ్రామాలకు వలస... చిరు వ్యాపారాలతో  ఆసరా.. - వలస కూలీల కష్టాలు

పొట్టకూటి కోసం సొంతవారిని వదిలి పట్టణాలకు వెళ్లిన వారిని కరోనా తిరిగి గ్రామాలకు వచ్చేలా చేసింది. అలా వచ్చిన వారు గ్రామాల్లో తమ ఉపాధిని వెతుక్కుంటున్నారు. తమకు వచ్చిన పనిని చేసుకుంటూ... సొంత ఊర్లోనే జీవనాన్ని సాగిస్తున్నారు.

migrant-labours-coming-back-to-their-villages-in-narayanpet-district
గ్రామాలకు వస్తున్నారు... కుటుంబాలకు ఆసరా అవుతున్నారు

By

Published : Jan 21, 2021, 4:20 PM IST

నారాయణపేట జిల్లా గుడిగండ్ల గ్రామంలో దశాబ్దాలుగా అనేకమంది యువత... ఉపాధి కరువై పొట్టకూటి కోసం పట్నాల బాట పడుతూనే ఉన్నారు. సొంతవారికి దూరంగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కానీ కరోనా మహమ్మారి వల్ల వారు ఆ ఉపాధిని కూడా కోల్పోయి... మళ్లీ సొంత గ్రామానికి వచ్చేశారు.

వైరస్ తగ్గుముఖం పట్టినా... కొందరు నగరాలకు వెళ్లినా... అధిక శాతం యువత మాత్రం గ్రామంలోనే ఉంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. గుడిగండ్లకు చెందిన శ్రీను... పదేళ్ల క్రితం భార్యా పిల్లలతో హైదరాబాద్​కు వలస వెళ్లారు. అక్కడ హోటల్​లో మాస్టారుగా పని చేసేవారు. లాక్​డౌన్​ సమయంలో గ్రామానికి వచ్చిన శ్రీను... సంపాదించిన కొద్దిపాటి సొమ్ముతో తోపుడు బండి చేయించుకొని... టిఫిన్ సెంటర్ నడుపుతూ రోజుకు 400 వరకు సంపాదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర గౌడ్ ఐదేళ్ల క్రితం హైదరాబాద్​కు వలస వెళ్లారు. మెడికల్ కంపెనీలో డెలివరీ బాయ్​గా పనిచేసేన అతను టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.

ఇదీ చూడండి:వంశీ సందేశాత్మక చిత్రం.. ఈ 'స్వార్థం'

ABOUT THE AUTHOR

...view details