డీసీసీబీ ఛైర్మన్గా మక్తల్ వాసి... సంబురాల్లో కార్యకర్తలు - DCCB ELECTIONS IN MAHABOOBNAGAR
డీసీసీబీ ఛైర్మన్గా మక్తల్ వాసి నిజాంపాషా ఎన్నిక కాగా... పట్టణంలో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. తనను ఎన్నుకున్నందుకు పేరుపేరునా నిజాంపాషా కృతజ్ఞతలు తెలిపారు.
MAKTHAL RESIDENT ELECTED AS MAHABOOBNAGAR DCCB CHAIRMEN
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్గా మక్తల్ వాసి నిజాంపాషా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో మక్తల్లో కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి పూలమాలలేశారు. డీసీసీబీ ఛైర్మన్గా తనను ఎన్నుకున్నందుకు నిజాంపాషా పేరుపేరునా... కృతజ్ఞతలు తెలిపారు. రైతులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నేతలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.