నారాయణ పేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలో పలు అభివృద్ది పనులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితోపాటు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పరిశీలించారు. డంపింగ్ యార్డ్, కూరగాయల మార్కెట్, షాంపింగ్ కాంప్లెక్స్‌తో పాటు వీధివ్యాపారుల కోసం నిర్మాణాలు, మినీ ట్యాంక్ బండ్ వద్ద చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే పలు పనులు ప్రారంభదశలో ఉండగా, మిగతావాటికి టెండర్లు పిలవడం జరిగిందని, అతిత్వరలో టెండర్లు ఖరారు చేసి పనులను ప్రారంభిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - makthal muncipality
మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో పాటు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పరిశీలించారు. లైనంత త్వరగా పనులను పూర్తిచేసి, అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
రాయిచూరు రోడ్డులోని కెనాల్ వద్ద అక్రమ కట్టడాలు ఉంటే వాటిని తొలగించుకోవాలని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తిచేసి, అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పావని మల్లిఖార్జున్, మార్కెట్ ఛైర్మన్ రాజేశ్ గౌడ్, కమిషనర్ పావని, ఏఈ నాగశివ, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:కేంద్రం పూర్తి పరిహారం ఇవ్వాల్సిందే : మంత్రి హరీశ్