నారాయణపేట జిల్లా మక్తల్‌లోని ఏడో వార్డులో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి మొక్కలు నాటారు. అవసరమున్న ప్రతిచోటా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.
'ప్రతిఒక్కరూ ఆరు మొక్కలు నాటి సంరక్షించాలి' - నారాయణపేట జిల్లాలో హరితహారం కార్యక్రమం తాజావార్తలు
ప్రతి పౌరుడు తన ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సూచించారు. హరిత సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటాలి
సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి పౌరుడు తన ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ రాజేష్ గౌడ్, పలువురు ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.