పల్లెలు అభివృద్ధి చెందినపుడే... దేశం అభివృద్ధి చెందుతుందని.. అందుకే గ్రామాల అభివృద్ధిపైనే సీఎం కేసీఆర్ ఎక్కువ దృష్టిసారించారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. నేరుగా ఫైనాన్స్ కమిషన్ నిధులతోపాటు రాష్ట్ర నిధులను ప్రతినెలా క్రమం తప్పకుండా మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసి, పారిశుద్ధ్యం మరింత త్వరగా జరిగేలా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.
'స్వచ్ఛ గ్రామాలతోనే బంగారు తెలంగాణ' - Makthal Mla chittem ram mohan reddy distribution Tractors to the panchayaths
నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
'స్వచ్ఛగ్రామాలతోనే బంగారు తెలంగాణ'
30రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోవాలని సూచించారు. అనంతరం 5 మండలాల పరిధిలోని గ్రామాలకు మంజూరైన 28 ట్రాక్టర్లను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, జడ్పీ ఛైర్పర్సన్ వనజమ్మ, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గొల్లపూడి జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన