కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ మైనార్టీ గురుకుల పాఠశాలలో రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. కొవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కరోనాను ఎదుర్కొవాలన్నారు.
రంజాన్ కిట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి - ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వార్తలు
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నారాయణపేట జిల్లా మక్తల్ మైనార్టీ గురుకుల పాఠశాలలో రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ జరుపుకోవాలని సూచించారు.
చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ప్రతి ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ నిజం పాషా, తహసీల్దార్ నర్సింగ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోను: ఈటల రాజేందర్