జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు అని నారాయణపేట కలెక్టర్ హరిచందన కొనియాడారు. గాంధీజీ ఇచ్చిన సందేశాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా మన ఆరోగ్యం మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. నారాయణ పేట జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ కాలనీలో మహాత్ముని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
'గాంధీజీ సందేశాలను అమలుచేస్తున్నాం'
గాంధీజీ ఇచ్చిన సందేశాలనే మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని నారాయణపేట కలెక్టర్ హరిచందన తెలిపారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా జిల్లా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడం లేదని అన్నారు. జిల్లా కేంద్రంలో గాంధీనగర్ కాలనీలో మహాత్ముని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
'గాంధీజీ సందేశాలను అమలుచేస్తున్నాం'
కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జడ్పీ ఛైర్‌పర్సన్ వనజతో కలిసి పాల్గొన్నారు. స్వచ్ఛభారత్‌లో తెలంగాణ రాష్ట్రం మొదటిగా నిలిచిందని అన్నారు. వరుసగా మూడోసారి స్వచ్ఛ భారత్ అవార్డు రావడం గొప్ప విషయమని కొనియాడారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి వందశాతం ఓడిఎఫ్ జిల్లాగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఇదీ చదవండి:మహాత్ముడు చెప్పిన మాటలు- భారతావనికి పాఠాలు