నారాయణపేట జిల్లా మాగనూర్‌లో ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికులు కాలినడకన స్వస్థలానికి పయనమయ్యారు. ఒడిశాకు కార్మికులు గత కొంత కాలంగా ఇటుక బట్టిల్లో పనిచేస్తున్నారు. లాక్డౌన్ పొడిగింపు కారణంగా... ఇన్ని రోజులు వేచి చూసిన కార్మికులు కాళ్లనే నమ్ముకుని తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.
వలస కార్మికులకు అండగా నిలిచిన తహశీల్దార్ - labour problems
స్వస్థలానికి కాలినడకన పయనమైన వలసకార్మికులకు నారాయణపేట జిల్లా మాగనూర్ తహశీల్దార్ అండగా నిలిచాడు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రత్యేక వాహనంలో స్వస్థలానికి పంపిస్తామని భరోసానిచ్చారు. కూలీల యజమానితో మాట్లాడి న్యాయ చేపిస్తామని తెలిపారు.
వలస కార్మికులకు అండగా నిలిచిన తహశీల్దార్
సుమారు ఆరు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ప్రభుత్వాధికారులు, పోలీసులు కలుగజేసుకుని వలస కార్మికులను మాగనూర్ తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. పరిస్థితిని తెలుసుకున్న తహశీల్దార్ రమేశ్... ఇటుకబట్టీల యజమానితో మాట్లాడతానని కార్మికులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ అనుమతి తీసుకుని రెండు మూడు రోజుల్లో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు