నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు.. పురవీధుల గుండా ర్యాలీ తీశారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం పర్యావరణాన్ని సంరక్షిద్దాం అంటూ.. నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. సమస్త జీవరాశికి, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను వాడరాదని సూచించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల అనారోగ్యాల బారిన పడతారని ప్రజలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు.. తదితరులు పాల్గొన్నారు.
'ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం' - plastic free society
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూ.. నారాయపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో విద్యార్థులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
అవగాహన