ఆర్టీసీ రాష్ట్ర బంద్‌లో భాగంగా నారాయణపేటలో అఖిలపక్ష నాయకులు డిపో వరకు ర్యాలీ చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్మికులు మానవహారం నిర్వహించారు. రహదారిపై వాహనాలను అడ్డుకున్న అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. నారాయణపేట డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదలలేదు. బంద్‌లో జిల్లా వాసులు, వ్యాపారస్తులు పూర్తి మద్దతు తెలిపారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బ్యాంకులు సైతం మూసేశారు.
నారాయణపేటలో ఆర్టీసీ రాష్ట్ర బంద్ ప్రశాంతం - LEADERS ARRESTED IN TSRTC BANDH AT NARAYANPET
నారాయణపేట జిల్లాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌లో పాల్గొన్న పలు విపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు.
LEADERS ARRESTED IN TSRTC BANDH AT NARAYANPET