తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాలుగు కాదు.. పది లక్షల పరిహారం కావాలి' - భూ నిర్వాసితులు

ప్రస్తుత మార్కెట్​ ధర ప్రకారమే పరిహారాన్ని అందించాలని కోరుతూ.. భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నారాయణ పేట జిల్లా మాగనూర్​లో చోటుచేసుకుంది.

Land expatriates protests in Maganur in Narayanapeta district demanding more Compensation
'నాలుగు కాదు.. పది లక్షల పరిహారం కావాలి'

By

Published : Jan 27, 2021, 1:08 PM IST

నారాయణ పేట జిల్లా మాగనూర్​లో భూ నిర్వాసితులకు.. ఎకరానికి రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఆ మేరకు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకు నిర్మాణాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు.

లింగంపల్లి గ్రామం సమీపంలో రైల్వే శాఖ.. నూతన రైల్వేస్టేషన్ నిర్మాణానికి తలపెట్టింది. అందుకోసం అవసరమైన భూమిని.. అక్కడి రైతుల నుంచి కోరింది. పరిహారంగా ఎకరాకు రూ. 4లక్షల చొప్పున ఇస్తామని వారితో ఒప్పందం కుదుర్చుకుంది.

కానీ.. ప్రస్తుతం మార్కెట్​లో ఎకరా విలువ రూ. 10లక్షలు పలుకుతుండటంతో రైతులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుత ధర ప్రకారమే.. పరిహారాన్ని చెల్లించాలంటూ వారు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి:తండ్రి కోసం పిల్లల ఆరాటం.. భర్త కోసం భార్య పోరాటం

ABOUT THE AUTHOR

...view details