చేతన ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ (Chetana Foundation) తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలోని 120 ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ తరగతుల కోసం 120 టీవీలను అందజేశారు. పట్టణ ప్రగతి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదిగా డీఈవో లియాకత్ అలీకి టీవీలు అందజేశారు. చేతన ఫౌండేషన్ సేవలను కేటీఆర్ కొనియాడారు. చేతన సీనియర్ సభ్యులు రంగారావును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరి చందన, జిల్లా విద్యాధికారి లియాకత్ అలీ, చేతన ఫౌండేషన్ సభ్యులు రంగారావు, వెనిగళ్ల వెంకటేశ్వర్లు, శాంతా, ముత్తినేని సురేశ్, చంద్రకాని నవీన్, షేక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
చేతన ఫౌండేషన్ అనేది అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. దేశవ్యాప్తంగా మా ఫౌండేషన్ సభ్యులు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్‌లోనూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. పేద, మధ్యతరగతి పిల్లలు చదువుకునే 100 ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ తరగతులు బోధించాలని టీవీలను అందజేశాం.
-- సురేశ్, చేతన ఫౌండేషన్ సభ్యుడు