కృష్ణానది ఉద్ధృతి... అప్రమత్తమైన అధికారులు - వరదనీరు
కృష్ణానది పరివాహక ప్రాంతంలో జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.
నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో వాసునగర్ ప్రాంతం పూర్తిగా వరదనీరులో మునగడం వల్ల అప్రమత్తమైన అధికారులు గ్రామస్థులను ఖాళీ చేయించారు. కృష్ణానదిలో పెరుగుతున్న ఉద్ధృతికి హిందూపూర్‌లోని దళితవాడలో ఇళ్లను ఖాళీ చేయించి ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కృష్ణ మండల కేంద్రానికి, హిందూపూర్ గ్రామానికి వరద నీరు వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
- ఇదీ చూడండి : జూరాలకు పోటెత్తుతోన్న వరద