తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు : రాజేందర్​రెడ్డి - నారాయణపేట జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో చెక్కుల పంపిణీ

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు నాంది పలికారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందజేశారు.

kalyanalakshmi, shadhi mubarak cheques distribution by narayanapeta  mla rajendr reddy
దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు : రాజేందర్​రెడ్డి

By

Published : Dec 7, 2020, 3:57 PM IST

దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో 133 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు.

అధికారంలోకి వచ్చిరాగానే అభివృద్ధి పథకాలకు సీఎం నాంది పలికారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్​ ఛైర్మన్ వనజమ్మ, ఎంపీపీ శ్రీనివాస్​రెడ్డి, పురపాలక ఛైర్మన్ అనసూయ, జడ్పీటీసీ అంజలి, పీఎసీఎస్​ ఛైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:వరదసాయం కోసం మీ-సేవ కేంద్రాలకు రావొద్దు: జీహెచ్ఎంసీ కమిషనర్

ABOUT THE AUTHOR

...view details