తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోషకాహారం అందించడంలో అంగన్​వాడీల పాత్ర కీలకం'

చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాలు అందించడంలో అంగన్​వాడీల పాత్ర చాలా గొప్పదని జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి తెలిపారు. కలెక్టరేట్​లో జరిగిన సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

పోషణ అభియాన్ ద్వారా పోషకాలు
పోషణ అభియాన్ ద్వారా పోషకాలు

By

Published : Aug 5, 2020, 11:46 AM IST

పోషణ అభియాన్ ద్వారా కావలసిన పోషకాలు అందించడంలో అంగన్​వాడీ సెంటర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని నారాయణపేట జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు.

పోషకాహారం అందించడమే కాకుండా శానిటైజేషన్, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, డీఆర్ డీఓ మొదలైన శాఖలు అందించవలసిన సౌకర్యాలపై చర్చించారు. అనంతరం జిల్లాలో చేపపిల్లల పెంపకానికి సంబందించిన టెండర్ ను ఫైనల్ చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఛాంబర్ లో పశు సంవర్ధక శాఖ, మత్య్స శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

ప్రతి సంవత్సరం మత్య్స సంఘాలకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తారని.. ఈ సంవత్సరం జిల్లా లో ఉన్న చెరువులలో కోటి 60 లక్షల చేపపిల్లల పంపిణీకి టెండర్ ఖరారు చేశామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details