నారాయణపేట జిల్లాలో భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రచారంలో భాగంగా ఎంపీ జితేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. లగడపాటి సర్వేలో గెలుస్తారని చెప్పినందుకే ప్రజలు రాజేందర్‌రెడ్డికి ఓటువేశారని ఆరోపించారు.
జితేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం
తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. మహబూబ్‌నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ తరఫున వచ్చిన ఎంపీ జితేందర్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది.
నేతల మధ్య మాటల యుద్ధం
ఇవీ చూడండి: రక్షక భటుల నిలయంలోనే రక్షణ లేకపోతే!