కర్ణాటక రాష్ట్రం నుంచి నారాయణ పేట జిల్లా మక్తల్కి నిషేధించిన గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిరాం, పవన్ కుమార్లు వాటిని అక్రమంగా విక్రయించడానికి తీసుకెళ్తుండగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ బృందం వారిని అదుపులోకి తీసుకుంది. సుమారు రూ. 12,500 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని బైక్ను సీజ్ చేశారు.
నిషేధిత గుట్కా ప్కాకెట్లు రవాణా.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు - latest news of narayanapeta
నారాయణ పేట జిల్లా మక్తల్లో ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణాకు టాస్క్ఫోర్స్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

నిషేదిత గుట్కా ప్కాకెట్లు రవాణా.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు