Harish Rao on BRS Manifesto in Narayanpet District : నారాయణపేట జిల్లాలో మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రినే అంటారని.. సీఎం కుర్చీ కోసమే కొట్లాడుకునే వాళ్లు ప్రజలను ఏం పట్టించుకుంటారని విమర్శించారు. కేసీఆర్ లేకుంటే రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యేవారా అని ప్రశ్నించారు తెలంగాణ వచ్చినందునే ఇవాళ రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని అన్నారు. అక్టోబర్ 15న వరంగల్ సభలో కొత్త మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటిస్తారని హరీశ్‌రావుతెలిపారు.
BRS New Manifesto in October 15th : బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. గత మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చామని గుర్తు చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు రూ.35,000 కోట్లు ఆపింది మోదీ సర్కార్ అని విమర్శించారు. పొరుగు రాష్ట్రం మోటార్లకు మీటర్లు పెట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందని అన్నారు. కేంద్రం నిధులు ఆపటంతో ఇబ్బందులు పడుతున్నాం కానీ మోటార్లకు మీటర్లు పెట్టలేదని హరీశ్‌రావు వెల్లడించారు.
Harish Rao on New Schemes : 'త్వరలోనే సీఎం కేసీఆర్ కొత్త పథకాలను ప్రకటిస్తారు'
Harish Rao Started a 50 Bed Hospital in Kosgi : అంతకు ముందు హరీశ్‌రావు కోస్గిలో (Kosgi) 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎసేనని, హాట్రిక్ సీఎం కేసీఆరేనని అన్నారు. భారత్ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజక వర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
Harish Rao Fires on Congress :కాంగ్రెస్ (Congress) పాలనలో 'నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానాకు' అని పాడుకునే వారని హరీశ్‌రావు గుర్తు చేశారు. బిడ్డ కడుపున పడినప్పటి నుంచే ప్రభుత్వ సహాయం అందుతోందని చెప్పారు. గర్భిణీలకు రూ.12,000 ఇస్తున్నామని, కాన్పు తర్వాత కేసీఆర్ కిట్ (KCR Kit)ఇస్తున్నాం అందిస్తున్నట్లు వివరించారు. మాటలు చెప్పే సర్కార్ కావాలా?.. చేతల సర్కార్ కావాలా? అని అన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణా జలాలు వస్తాయని హరీశ్‌రావు వివరించారు.
Mulugu Medical College Foundation Stone : 'తెలంగాణ ఏ రంగంలో చూసినా ప్రథమ స్థానంలో ఉంది'