Harish Rao On BJP Congress in Narayanpet Meeting : రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) అన్నారు. మాటలు చెప్పే సర్కార్ కావాలో.. చేతల సర్కార్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లాలోని కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన.. అనంతరం ప్రభుత్వ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో(BRS Public Meeting) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శించారు.
Harish Rao At Narayanpet Public Meeting :"కొడంగల్ నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణా జలాలు వస్తాయి. కొడంగల్‌కు ప్రస్తుతం కృష్ణా నుంచి తాగునీరు వస్తోంది. త్వరలోనే సాగునీరు కూడా వస్తుంది. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లటం ఖాయం. 3 వేల తండాలను సీఎం కేసీఆర్ గ్రామపంచాయతీలుగా మార్చారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు మహిళల కష్టాలు తీర్చారు కేసీఆర్. ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టనున్నారని" మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Harish Rao Fires on Congress :కాంగ్రెస్ పాలనలో 'నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానాకు' అని పాడుకునేవారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ కేసీఆర్ హయాంలో సర్కార్ దవాఖానాలే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మారాయని తెలిపారు. బిడ్డ కడుపున పడినప్పటి నుంచే ప్రభుత్వ సాయం అందుతోందని చెప్పారు. అదే విధంగా గర్భిణీలకు రూ.12 వేలు ఇస్తున్నామని.. కాన్పు తర్వాత కేసీఆర్ కిట్‌ను ఇస్తున్నామని వివరించారు. ఇంకా 12 లక్షల మంది ఆడపిల్ల వివాహాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేశామన్నారు. అదే పొరుగున ఉన్న కర్ణాటకలో ఎలాంటి పథకాలు ఉన్నాయో తెసుకోవాలని సూచించారు. ఆ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛనుగా నెలకు కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నారని అన్నారు.
"ఆడపిల్లలు చదువుకోవాలి.. పైకి రావాలని చెప్పి.. పెద్ద ఎత్తున పిల్లల కోసం డిగ్రీ కాలేజీలు, పీజీ కళాశాలలు ఎన్నో కార్యక్రమాలు తెచ్చారు. మహిళా యూనివర్సిటీని కూడా రాష్ట్రంలో సీఎం ప్రారంభించారు. మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేశారు. ఏ పని చేసిన మహిళలకే లబ్ధి అందాలని చెప్పారు. మహిళలను ఇంకా ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలి. మహిళల కోసం మేనిఫెస్టోలో మహిళల కోసం శుభవార్తను కచ్చితంగా వింటారు."- హరీశ్‌రావు, మంత్రి