తల్లిదండ్రులు మందలించడం వల్ల మనస్తాపం చెంది బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఎర్గాట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రషీద్ కథనం ప్రకారం... ఎర్గాట్పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడితో గత కొన్ని నెలలుగా చనువుగా ఉంటుంది.
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య - crime news
ఓ యువకుడితో చనువుగా ఉంటోందని గమనించిన తల్లిదండ్రులు మందలించడం వల్ల మనస్తాపం చెంది ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలోని ఎర్గాట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలికను మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. వెంటనే తండ్రి హుటాహుటిన నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ప్రథమ చికిత్స చేసిన వైద్యులు... మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడకు తరలిస్తుండగా మార్గమధ్యలో బాలిక మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని... గర్భవతిని చంపిన భర్త