తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులకు లెక్కలు తప్పాయి! - గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులకు లెక్కలు తప్పాయి!

నారాయణ పేట జిల్లాలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడంలో పంచాయతీ పాలకులు విఫలమయ్యారు. దీనికితోడు గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన ఖర్చు నిధులకు పక్కా లెక్కలు చూపలేకపోయారు. లెక్కలు చూపని పంచాయతీలకు లేఖలు పంపించి నెలలు గడుస్తున్నా.. ఎవరూ స్పందించలేక పోతున్నారు. గతేడాది నిధుల ఖర్చుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

rural development funds were misused at narayanpet district
గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులకు లెక్కలు తప్పాయి!

By

Published : Aug 25, 2020, 10:14 AM IST

నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో పంచాయతీ నిధుల లెక్క తప్పింది. మొత్తం 280 గ్రామపంచాయతీలు ఉండగా 279 పంచాయతీల మదింపు పూర్తయ్యింది. కేవలం కోస్గి మండలం ముశ్రీఫ పంచాయతీ ఆడిట్‌ జరగలేదు. గతేడాది పంచాయతీలకు వచ్చిన రూ.19.26 కోట్లు రాగా ఆ నిధుల్లో ఖర్చయిన రూ.11.27 కోట్లపై మొత్తం 1,156 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇందులో 436 అభ్యంతరాలకు (లైబ్రరీ, సీనరేజ్‌, వ్యాట్‌ ఛార్జెస్‌, లేబర్‌సెస్‌ తదితర) సంబంధించి ప్రభుత్వానికి రూ.1,12,23,357 కట్టాల్సి ఉంది. మరో రూ. 15 లక్షలకు సంబంధించి లెక్కాపత్రం లేనట్లుగా నిర్ధరించారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మొదటి వారం సర్పంచులు కొనసాగగా అప్పట్లో పదవీ కాలం ముగుస్తుండటంతో ఇష్టారాజ్యంగా నిధులను ఖర్చుచేశారు. తీరా వాటికి సరైన పత్రాలు చూపించలేకపోవడంతో 68 మంది కార్యదర్శులు లేఖలు అందుకున్నారు. నెలలు గడిచి గడువు సమీపిస్తున్నా ఆడిట్‌శాఖ లేవనెత్తిన అంశాలకు సంబంధించి సమాధానాలు ఇచ్చేందుకు పంచాయతీ పాలకులు ముందుకు రావడంలేదు. కేవలం ఒకే ఒక్కరు సమాధానం ఇవ్వడంతో కట్టాల్సిన రూ.37వేలు తిరిగి చెల్లించారు.

జిల్లాలోని గ్రామపంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరం నిధుల ఖర్చుకు సంబంధించిన ఆడిట్‌ పూర్తయ్యింది. వచ్చిన అభ్యంతరాల్లో 436 అభ్యంతరాలకు సంబంధించి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో రూ.1.12 కోట్లు కట్టాల్సి ఉంది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి మరో 43 అభ్యంతరాలకు రూ.15లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉంది. కార్యదర్శులకు లేఖలు పంపినా స్పందించడంలేదు. మరికొన్ని రోజుల్లో లేఖల గడువు ముగియనుండటంతో అంతవరకు వేచిచూసి తర్వాత శాఖపరమైన చర్యలు చేపడతాం.

- శ్యాంసుందర్‌ ప్రసాద్‌, జిల్లా అడిట్‌శాఖ అధికారి, నారాయణపేట

  • జిల్లాలోని గ్రామ పంచాయతీలు : 280
  • ఆడిట్‌ పూర్తయినవి : 279
  • ఆడిట్‌చేసుకోని పంచాయతీ : 01
  • మొత్తం అభ్యంతరాలు : 1,156
  • ఆడిట్‌శాఖ జారీచేసిన లేఖలు : 68
  • సమాధానాలు ఇచ్చినవి : 1
  • సీరియస్‌ అభ్యంతరాలు, కట్టాల్సిన డబ్బులు : 11 (వీటికి సంబంధించి రూ.5,93,498 లక్షలు)
  • లెక్కల్లో తప్పులపై వచ్చిన అభ్యంతరాలు : 32 (వీటికి సంబంధించి రూ.9,40,927 లక్షలు)

ఇదీ చూడండి:-ఆ భాజపా ఎంపీ ఇంట్లో 12 మందికి కరోనా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details