నారాయణపేట జిల్లా మక్తల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. నెల రోజుల్లో పాఠశాల ప్రారంభమయ్యే అవకాశం ఉందని అందువల్ల విద్యార్థులందరూ బాగా చదవాలని పేర్కొన్నారు. సందేహాలు ఏమైనా ఉంటే మీ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
మక్తల్‌లో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ - పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
నారాయణపేట జిల్లా మక్తల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.
మక్తల్ లో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ
అందరూ భౌతిక దూరం పాటించాలని గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు నమోదు ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు పాఠశాలలో మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్, ఎంఈవో లక్ష్మీనారాయణ, హెచ్ఎం జగదీశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.