వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నారాయణ పేట జిల్లా సింగారం గేట్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత రెండు నెలల నుంచి వరి ధాన్యాన్ని, తమ పొలాల నుంచి అమ్మటానికి, తరలించేందుకు, గన్ని బ్యాగ్ ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గోదాం దగ్గరికి ధాన్యాన్ని తీసుకువచ్చినా రెండు నెలల నుంచి పడిగాపులు కాస్తున్నామని పేర్కొన్నారు.
Farmers Protest: వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల నిరసన - వరి ధాన్యం ఆందోళన
వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నారాయణపేట జిల్లాలో రైతులు ధర్నా నిర్వహించారు. పీఏసీఎస్ లో రెండు నెలల నుంచి ధాన్యం ఉన్నా.. అధికారులు కొనడం లేదని ఆరోపించారు. గన్నీ బ్యాగ్ ల కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
Formers protest natrayanpet district
ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ ఛైర్మన్ రాస్తారోకో వద్దకు చేరుకుని ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్, బికేస్ జిల్లా అధ్యక్షులు వెంకొబ, రైతు సంఘం నాయకులు హాజీ మలంగ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.