నారాయణపేట జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతమైన హిందూపూర్, వాసునగర్ గ్రామాలు జలమయమయ్యాయి. ముంపు బాధితులకు గృహోపకరణాలు అందజేస్తున్నట్టు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్ట్‌ర్ రోనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. నీటి ప్రవాహం తగ్గడంతో ఇంటిబాట పడుతున్న గ్రామస్థులకు తక్షణం అవసరమయ్యే ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఐదు లక్షల విలువైన వంట సామాగ్రిని అందిస్తున్నట్టు వివరించారు. హిందూపూర్ గ్రామంలోని 210 కుటుంబాలకు తక్షణం అవసరమయ్యే గ్యాస్స్టౌతో పాటు వంటపాత్రలు, దుప్పట్లు, చీరలు, దోమతెరలను అందిస్తున్నట్టు వివరించారు.
ముంపు బాధితుల సహాయక చర్యలకు ఏర్పాట్లు - కృష్ణానది
కృష్ణానది వరద ముంపు గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలకు ఏర్పాట్లు చేశామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్ట్‌ర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు.
ముంపు బాధితుల సహాయక చర్యలకు ఏర్పాట్లు