తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రికొడుకులను కబళించిన కరోనా - కరోనాతో తండ్రికొడుకులు మృతి

రాష్ట్రంలో కరోనా​ వైరస్​ విలయతాండవం చేస్తోంది. నారాయణ పేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో తండ్రికొడుకులు కొవిడ్​తో మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది.

corona
తండ్రికొడుకుల మృతి

By

Published : May 10, 2021, 1:15 AM IST

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో తండ్రికొడుకులు కొవిడ్​తో మూడు రోజుల వ్యవధిలోనే మృతి చెందారు. సుంకు రాజయ్య కుటుంబ సభ్యుల్లో పలువురు కరోనా బారిన పడ్డారు. రాజయ్య ఆయన చిన్న కొడుకు చందు, కోడలు, మనవరాలుకు కొవిడ్​ పాజిటివ్ రాగా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులు అందరూ హోమ్ క్వారంటైన్​లోనే ఉండగా కొడుకు చందు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అంబులెన్స్​లో నారాయణపేట ఆస్పత్రికి అటు నుంచి మహబూబ్​నగర్ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స నిర్వహిస్తుండగా ఈనెల 7న పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆ తర్వాత కరోనా నుంచి కుదుటపడ్డట్టు కనిపించిన రాజయ్య ఆదివారం మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నారాయణపేట ఆస్పత్రికి అటు నుంచి మహబూబ్​నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం నుంచి అంబులెన్స్ నుంచి దించుతుండగానే ప్రాణాలు వదిలారు.

ABOUT THE AUTHOR

...view details