నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద భాజపా ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. గత 5 రోజుల నుంచి గన్నీ సంచులు ఇవ్వకుండా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గన్నీ సంచుల కోసం ధర్నాకు దిగిన రైతులు - తెలంగాణ వార్తలు
రైతులకు పంట పండించుకోవడం ఒక ఎత్తయితే.. పండించిన పంటను అమ్ముకోవడం మరో ఎత్తవుతుంది. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గన్నీ సంచులు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై భాజపా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
గన్నీ సంచుల కోసం ధర్నాకు దిగిన రైతులు
భాజపా కార్యకర్తలు జిల్లా వ్యవసాయ అధికారితో ఫోన్లో సంప్రదించగా రైతులకు సరిపడా గన్నీ సంచులు ఊట్కూర్ మండల కేంద్రానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో రైతులు, ఊట్కూరు భాజపా మండల అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భాగ్యనగరానికి భారీ సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు