సమాజంలో జరుగుతున్న అవినీతిపై ప్రతి ఒక్కరు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన సూచించారు. మక్తల్‌లోని ఆంజనేయస్వామి కల్యాణమండపంలో సమాచార హక్కు చట్టం సంఘం నిర్వహించిన ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
'ప్రతి ఒక్కరు అవినీతి అంతానికి కృషి చేయాలి' - ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎస్పీ
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరు అవినీతి అంతానికి కృషి చేయాలని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. మక్తల్‌లో నిర్వహించిన ప్రపంచ అవినీతి వ్యతిరేక దివోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'ప్రతి ఒక్కరు అవినీతి అంతానికి కృషి చేయాలి'
సమాచారం హక్కు చట్టం అనే వజ్రాయుధంతో అవినీతి అంతానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. సమాజంలో ముఖ్యంగా మహిళలు వివక్షకు గురవుతున్నారని తెలిపారు. కుల, మత, వర్ణ, లింగ వివక్ష లేని సమాజం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు నారాయణ, హాజమ్మ, శివప్ప, శ్రీనివాసులు, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.