తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి నెల శ్రమదానం: కలెక్టర్​ - జిల్లా పాలనాధికారి ఎస్​. వెంకట రావు

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతినెల మొదటి శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రమదానం నిర్వహించాలని కలెక్టర్ ఎస్​. వెంకట రావు​ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి నెల శ్రమదానం: కలెక్టర్​

By

Published : Oct 4, 2019, 8:35 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి నెల మొదటి శుక్రవారం శ్రమదానం, పరిసరాల పరిశుభ్రత కార్యాక్రమాలను నిర్వహించాలని స్థానిక జిల్లా పాలనాధికారి ఎస్​. వెంకట రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు కార్యాలయంలోని ఫర్నీచర్, ఫైళ్లను శుభ్రపరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి నెల శ్రమదానం: కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details