తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఊట్కూరులో సందడిగా పీర్ల ఊరేగింపు'

మొహరం పండుగను పురస్కరించుకుని నారాయణపేట జిల్లా ఊట్కూరులో పీర్ల నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఎస్పీ డాక్టర్​ చేతన తెలిపారు. ఊరేగింపు ప్రక్రియకు ఏర్పాటు చేసిన బందోబస్తును ఆమె పర్యవేక్షించారు.

doctor sp chethana visited peerlu  Procession Arrangements at utkuru in narayanpet district
'పీర్ల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకూడదు'

By

Published : Aug 31, 2020, 8:45 AM IST

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మొహర్రం ఏర్పాట్లను ఎస్పీ డాక్టర్ చేతన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పదో రోజు సాయంత్రం హసన్, హుస్సేన్ పీర్లను నిమజ్జనానికి తరలించే ఆయా ప్రాంతాల్లో బందోబస్తును పరిశీలించారు. అక్కడ పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఊరేగింపులో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్​రావు, సీఐ శంకర్, ఎస్సై రషీద్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details