నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో మహబూబ్‌నగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణ పర్యటించారు. అనంతరం స్థానిక పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. నమోదైన పోలింగ్ శాతం వివరాలను బూత్‌ల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మక్తల్‌లో పోలింగ్ తీరును పరిశీలించిన డీకే అరుణ
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మక్తల్‌లోని పోలింగ్ బూత్‌ని డీకే అరుణ పరిశీలించారు. అభ్యర్థి వెంట పెద్ద సంఖ్యలో స్థానిక భాజపా కార్యకర్తలు తరలివచ్చారు.
పోలింగ్ శాతం వివరాలను తెలుసుకున్న అభ్యర్థి డీకే అరుణ