నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం రైతు అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు.
రైతు అవగాహన సదస్సుకు ఏర్పాట్లు సిద్ధం - MLA Rajender Reddy
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా నారాయణపేటలో గురువారం రైతు అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు.
రైతు అవగాహన సదస్సుకు ఏర్పాట్లు సిద్ధం
ఈ సందర్భంగా సభాస్థలి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతనతో కలిసి సందర్శించారు. సమావేశానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ అధికారులు, తహసీల్దార్ పాల్గొన్నారు.