నారాయణపేట జిల్లా మక్తల్ వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో 1.18 కోట్ల వ్యయంతో నిర్మించిన దుకాణ సముదాయలన్నీ ఇప్పటికీ వృథాగానే ఉన్నాయి. ఏడాదిన్నర కిందటే ప్రారంభించినప్పటికీ ఇంకా వేలం పాట నిర్వహించకపోవడం వల్ల మార్కెట్... లక్షల్లో ఆదాయం కోల్పోయింది. ఈ దుకాణాల సముదాయం ప్రధాన వ్యాపార కూడలిలో ఉంది. ఈ పరిసరాల్లో ప్రైవేటు దుకాణానికి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు అద్దె వస్తుంది.
మక్తల్లో వృథాగా పడి ఉన్న దుకాణా సముదాయాలు - Dilapidated shopping malls at makthal
నారాయణపేట జిల్లా మక్తల్లో అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వానికి నష్టం చేస్తోంది. కోటి రూపాయలతో నిర్మించిన దుకాణాలను వేలం వేయకుండా వృథాగా వదిలేశారు. ఫలితంగా టు మార్కెట్, ఇటు వ్యాపారులిద్దరూ నష్టపోతున్నారు.

మక్తల్లో వృథాగా పడిఉన్న దుకాణ సముదాయాలు
ఏడాదిన్నర కిందటే ఈ దుకాణాలు ప్రారంభించి వెంటనే వేలం వేస్తే... మార్కెట్కు నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం వచ్చుండేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 167వ జాతీయ రహదారిలో పలువురు వ్యాపారులు దుకాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వారంతా మార్కెట్ దుకాణాలకు ఎప్పుడు వేలం వేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దుకాణాలు వేలం వేయాలని కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి:నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత