నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన 2020 ఏడాది వ్యవసాయ పంటల ప్రణాళికపై జిల్లా మిల్లర్లు, డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు వరి, మొక్కజొన్న విత్తనాలు అమ్మరాదని డీలర్లను ఆదేశించారు.
ఆదేశాలు వచ్చేవరకు.. విత్తనాలు అమ్మరాదు : కలెక్టర్ - కలెక్టర్ హరిచందన
ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు మిల్లర్లు, డీలర్లు రైతులకు విత్తనాలు అమ్మకూడదని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరి చందన ఆదేశించారు. ఈ మేరకు ఆమె డీలర్లు, విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వరి, మొక్కజొన్న విత్తనాలు తప్ప ఇతర విత్తనాలు అమ్ముకోవచ్చని సూచించారు.
ఆదేశాలు వచ్చేవరకు.. విత్తనాలు అమ్మరాదు : కలెక్టర్
కందులు, పత్తి, నూనెలకు సంబంధించిన పంటల విత్తనాలు అమ్ముకోవచ్చని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి నాణ్యమైన విత్తనాలు తెచ్చుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు.
ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష