ప్రజలంతా అపోహలు వీడి కొవిడ్ టీకా వేయించుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ప్రజల్లో టీకా పట్ల ఉన్న భయాలు పోగొట్టేందుకే తాను వ్యాక్సిన్ వేయించుకున్నానని తెలిపారు.
కొవిడ్ టీకా వేయించుకున్న జిల్లా కలెక్టర్ - నారాయణ్పెట్ జిల్లాలో కరోనా టీకా కార్యక్రమం
అపోహలను వీడి ప్రజంలతా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. టీకా పట్ల ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నారు.
జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల ప్రజలు కొవిడ్ టీకా వేయించుకుంటున్నారని కలెక్టర్ హరిచందన తెలిపారు. టీకా పట్ల ప్రజల్లో ఉన్న భయాలను తొలగించడం కోసం తాను వ్యాక్సిన్ వేయించుకున్నానన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో కరోనా మహమ్మారిని అంతమొందించడంలో చివరి దశకు చేరుకున్నామని పేర్కొన్నారు. టీకా వేయించుకున్నప్పటికీ మాస్క్ ధరిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.