తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ... ఆ నలుగురూ లేరు - నారాయణ పేట జిల్లా

అనారోగ్య సమస్యలతో మృతి చెందినవారి అంతిమసంస్కారాలకు కరోనా కష్టాలు తప్పడంలేదు. బంధువులు సైతం కడసారి చూపునకు నోచుకోని పరిస్థితి. ఇతర ప్రాంతలకు వలసవెళ్లి అనారోగ్యంతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి అనుమతించకపోవడం వల్ల.. ఊరిబయటే అంతిక్రియలు నిర్వహించిన సంఘటన నారాయణ పేట జిల్లాలో చోటుచేసుకుంది.

narayanapeta district latest news
narayanapeta district latest news

By

Published : May 7, 2020, 3:45 PM IST

నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండలం కాన్‌కుర్తికి చెందిన బద్రీనాథ్‌(35) కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌..చౌదర్‌గూడెంలో పెయింటు పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. దీంతో బద్రీనాథ్‌ సోదరులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.

విషయం తెలుసుకొన్న కొందరు గ్రామస్థులు అంబులెన్స్‌ను గ్రామంలోని రానివ్వకుండా అడ్డుకొన్నారు. చివరకు గుంతతవ్వడానికీ ఎవరూ రాకపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులే గుంతతవ్వారు. చేసేది లేక ముగ్గురు అన్నదమ్ములు, భార్య, కుమార్తె.. కొద్దిమంది సమక్షంలో మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతరం బద్రీనాథ్‌ భార్య, అన్నదమ్ములు అంబులెన్స్‌లోనే షాద్‌నగర్‌ వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details