నారాయణపేట జిల్లా తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కోస్గి కృష్ణ తనకున్న పొలంలో కీరదోస సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం వల్ల పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో పాలుపోక... పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
కరోనా ఎఫెక్ట్: సాగు చేసిన పంటంతా నేలపాలు - CORONA EFFECT ON KEERA CUCUMBER FARMER IN NARAYANAPETA
ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా లాక్డౌన్ కారణంగా నేలపాలైంది. అప్పులు తెచ్చి మరీ పంట సాగు చేస్తే... నష్టాలే మిగిలాయని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కరోనా ఎఫెక్ట్: సాగు చేసిన పంటంతా నేలపాలు
అధికారుల చుట్టూ తిరిగితే... పంటను అమ్ముకోవచ్చని తెలిపారు. కానీ సరైన డిమాండ్ లేనందున పంట మొత్తం నేలపాలైంది. దాదాపు 2 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని రైతు వాపోతున్నాడు.