తెలంగాణ

telangana

నారాయణపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

నారాయణపేట జిల్లా కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్​ వెంకట్​రావు అంబేద్కర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు.

By

Published : Nov 26, 2019, 8:48 PM IST

Published : Nov 26, 2019, 8:48 PM IST

Constituion day celebrations
నారాయణపేటలో రాజ్యాంగ దినోత్సవం


నారాయణపేట జిల్లా కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలను కలెక్టర్​ వెంకట్​రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు భోజన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు ఎంతవరకు తెలుసని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాజ్యాంగ దివస్ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. రాజ్యాంగ దివస్​ను పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణానికి చేసిన సేవలను కొనియాడారు.

నారాయణపేటలో రాజ్యాంగ దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details