నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయం నుంచి పట్టణ శివారు వరకు ర్యాలీ నిర్వహించారు. సంగంబండ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కిలోమీటరు పొడవునా రహదారి అధ్వాన్నంగా మారిందని దానిని తక్షణమే బాగు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ధర్నాతో సుమారు కిలోమీటరు పొడవున ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగప్రవేశం చేసిన పోలీసులు, మున్సిపల్ కమిషనర్ పావని నాయకులకు నచ్చజెప్పి వీలైనంత తొందరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రోడ్డు కోసం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు - కాంగ్రెస్ కార్యకర్తలు
నారాయణపేట జిల్లాలోని సంగంబండ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.
రోడ్డు కోసం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు