నారాయణపేట జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు దీనికి సహకరించాలని కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ చేతన కోరారు. ఓటు వేసేందుకు వచ్చే వారు త్వరగా వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జన సంచారం ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. దివ్యాంగులకు కేంద్రంలో ప్రత్యేకమైన సౌకర్యాలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
' ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలి' - chetana
నారాయణపేట జిల్లాలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బందికి ఇవాళ మధ్యాహ్నం వరకు ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి అందించనున్నారు. పోలింగ్ బూత్‌ల దగ్గర ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1950కి ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ
ఇవీ చూడండి: 'ఈసీ విశ్వసనీయతపై అనుమానాలు'