నారాయణపేట సాంఘిక గురుకుల పాఠశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు భవనం కోసం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ డాక్టర్ చేతన పరిశీలించారు. జిల్లా కేంద్రంలో రెండో విడత పోలింగ్‌కు స్ట్రాంగ్ రూమ్‌ను పాలనాధికారి, ఎస్పీలు పరిశీలించారు.
ఎన్నికలు సజావుగా జరిగి, ఓట్లను ప్రశాంతమైన వాతావరణంలో లెక్కించాలని అధికారులు తెలిపారు. ఇందుకు అనువుగా జిల్లా కేంద్రానికి దూరంలో ఉన్న సాంఘిక గురుకుల పాఠశాల సముదాయాన్ని పరిశీలించారు.
స్ట్రాంగ్ రూమ్ కోసం గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్
స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరచడం కోసం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాట్లను పాలనాధికారి, ఎస్పీలు పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో లెక్కింపులు జరిపేందుకు అనువైన భవనం కోసం అన్వేషిస్తున్నారు.
సాంఘిక గురుకుల పాఠశాల సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ
ఇవీ చూడండి : 'ఓటేసిన వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతి'