తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ హరిత ట్రిబ్యునల్​కి ముష్టిపల్లి - నారాయణపేట జిల్లా ముష్టిపల్లిగ్రామంలో కలెక్టర్​ హరిచందన పర్యటించారు

నారాయణపేట జిల్లాలోని ముష్టిపల్లి గ్రామం జాతీయ హరిత ట్రిబ్యునల్​కి ఎంపికవ్వడం హర్షనీయమని కలెక్టర్ హరిచందన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి అధికారులకు పరిశుభ్రతపై దిశానిర్దేశం చేశారు.

collector harichandana visited mustipalli village in narayanapeta
ముష్టిపల్లి గ్రామం వందశాతం మలవిసర్జన రహితం: కలెక్టర్​ హరిచందన

By

Published : Jun 2, 2020, 7:03 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముష్టిపల్లిలో కలెక్టర్ హరిచందన పర్యటించారు. ముష్టిపల్లి వందశాతం బహిరంగ మలవిసర్జన రహితమైందన్నారు. అందుకే జాతీయ హరిత ట్రిబ్యునల్​కి ఎంపికైందని చెప్పారు. గ్రామంలో తడి, పొడి చెత్త వేరుచేసే షెడ్డును పరిశీలించారు.

అనంతరం పలు వీధుల్లో కలియ తిరుగుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను, మురుగు కాలువలను పరిశీలించారు. గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని గ్రామ అధికారులకు సూచించారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందుకు 'మంకీ ఫుడ్ కోర్ట్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: బంగారు తెలంగాణ దిశగా.. పచ్చని మాగాణియే లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details