గత రెండు మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు గ్రామాలలోని చెరువులు నిండడం వల్ల పెద్దజట్రం గ్రామంలోని పెద్ద చెరువును నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన పరిశీలించారు. పెద్ద చట్రం చెరువు దాదాపు 15 సంవత్సరాల తర్వాత చెరువు పూర్తిగా నిండి అలుగు పారడం వల్ల అక్కడి పరిస్థితిని స్వయంగా చూడడానికి వెళ్లారు.
అలుగులు పోస్తున్న చెరువులను సందర్శించిన కలెక్టర్
నారాయణపేట జిల్లాలో కలెక్టర్ హరిచందన పర్యటించారు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండాయి. వాటిని జిల్లా పాలనాధికారి పరిశీలించారు. ప్రజలకు తగు సూచనలు చేశారు.
collector hari chandana visit ponds in narayanpet district
గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు వంకలు చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తునందున ప్రజలు వాటి పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నారాయణ పేట జిల్లా మాగనూర్ మండల కేంద్రంలోని పెద్దవాగు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీని వల్ల 167వ జాతీయ రహదారి మాగనూర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: ఎంజీఎంలో కంప్యూటర్ల మొరాయింపు... రోగులకు తప్పని తిప్పలు