నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన స్వయంగా పరిశీలించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని పలు చౌరస్తాల్లో అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఎలాంటి కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు.
లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ - తెలంగాణ తాజా వార్తలు
నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో లాక్డౌన్ అమలుతీరును జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన పరిశీలించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని... అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకూడదని కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన తెలిపారు. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే... తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగానే అమలవుతోందని అన్నారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్సై రాములు, మక్తల్ తహసీల్దార్ నర్సింగ రావు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 3,043 కరోనా కేసులు, 21 మరణాలు