తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం' - Narayana Pet News

నారాయణపేట జిల్లా మక్తల్​ పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్​, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి పర్యటించారు. పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

Collector And MLA Visits Makthal Municipality
మక్తల్​లో కలెక్టర్​ పర్యటన

By

Published : Jun 6, 2020, 6:21 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్​లో మున్సిపాలిటీ అభివృద్దికి పాలకబృందం కలిసి కట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సూచించారు. ఎంపీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పావని మల్లిఖార్జున్ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు, కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే నిధులు కేటాయించబడ్డాయని..వాటిని అభివృద్ది పనులకు వాడుకోవాల్సిన బాద్యత అందరిపైనా ఉందన్నారు.

మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కరోనా సమయంలో ప్రతిఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. గంజ్ రోడ్​లోని ఎస్బీఐ బ్రాంచ్ ఆద్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. సుమారు 50 మందికి సరకులు అందించామని ఎల్డీఎం ప్రసన్నకుమార్, బ్యాంక్ మేనేజర్ శ్రీరామసుబ్బారావు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితోపాటు కలెక్టర్ హరిచందన, మున్సిపల్ చైర్ పర్సన్ పావని తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?

ABOUT THE AUTHOR

...view details