తెలంగాణ

telangana

ETV Bharat / state

స్ట్రాంగ్​ రూమ్​ల కోసం మక్తల్​లో కలెక్టర్, ఎస్పీ పర్యటన - collector

నారాయణపేట జిల్లా మక్తల్​లో కలెక్టర్​, ఎస్పీ పర్యటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్​ బాక్స్​లు​ భద్రపరచడానికి స్ట్రాంగ్​ రూమ్​ల కోసం గదులను పరిశీలించారు.

కలెక్టర్​, ఎస్పీ

By

Published : Apr 26, 2019, 9:02 PM IST

ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నారాయణపేట కలెక్టర్​ వెంకట్రావు, ఎస్పీ చేతన తెలిపారు. మక్తల్​ పట్టణ కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్​ బాక్స్​లు​ భద్రపరచడానికి స్ట్రాంగ్​ రూమ్​ల కోసం ఆయా మండలాల క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన గదులను పరిశీలించారు. ప్రతి పోలీస్ స్టేషన్​లో మైక్రో అబ్జర్వర్, ఉంటారని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికే స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ హాళ్లను పరిశీలిస్తున్నామన్నారు.ఇవీ చూడండి: జయ మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details