ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - clothes distribution
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో రంజాన్‌ను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిరుపేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే బట్టల పంపిణీ
రంజాన్‌ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. జూన్ 2న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. దానికి ముస్లిం సోదరులందరూ హాజరుకావాలని కోరారు.