నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్లో ఉన్న రైస్ మిల్లును పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తనిఖీ(Inspection) చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లుకు తీసుకురావాలన్నారు. వడ్లను త్వరగా మిల్లింగ్ చేయాలని కోరారు. లెవీ బియ్యం సకాలంలో తిరిగి అప్పగించాలని స్పష్టం చేశారు.
Inspection: రైసుమిల్లు తనిఖీ చేసిన పౌరసరఫరాల తహసీల్దార్ - తెలంగాణ వార్తలు
రైతుల నుంచి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లుకు తీసుకురావాలని పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ కోరారు. నారాయణ పేట జిల్లా మరికల్ మండలం తీలేర్లో ఉన్న రైస్ మిల్లును తనిఖీ(Inspection) చేశారు.
Inspection: రైసుమిల్లు తనిఖీ చేసిన పౌరసరఫరాల తహసీల్దార్
మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడంతో అతనితో ఫోన్లో మాట్లాడారు. మిల్లర్లకు కేటాయించిన ధాన్యం కోటా తీసుకోవడం పూర్తయినప్పటికీ తగిన నిల్వ కోసం స్థలం ఉంటే అదనపు కోటా ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కరోనా వేళ మిల్లులో పని చేసే ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి ఉండాలన్నారు.
ఇదీ చదవండి: పిల్లలను కాపాడుకునేందుకు ఒక కంచెలా నిలబడాలి: సత్యవతి