కృష్ణా జలాలను తరలించేందుకు.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు వేసినట్లు నారాయణపేట జిల్లా సర్పంచుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి బాపన్‌పల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఏపీ జీవోపై... జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు - ఏపీ జీవోపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో నారాయణపేట జిల్లా సర్పంచుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కేసు వేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అందులో పేర్కొన్నారు.
ఏపీ జీవోపై... జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు
ప్రాజెక్టు నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, కేంద్ర జలసంఘం, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోలేదన్నారు. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి, కేంద్ర జలసంఘం, కృష్ణానది బోర్డుకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
ఇదీ చూడండి:ఇవాళ మంత్రులు, ఇంజినీర్లతో కేసీఆర్ కీలక భేటీ