నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సమాచార శాఖ విభాగంను ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం ఖర్చులను పరిశీలించే అధికారం ఈ కమిటీ సభ్యులకు ఉంటుందని కలెక్టర్ ఎస్. వెంకట్రావు పేర్కొన్నారు.
అభ్యర్థులు ప్రచారం ఖర్చులు, నిబంధనలు పాటించాలి
నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు ప్రచారం ఖర్చులు, నిబంధనలు పాటించాలని కోరారు.
అభ్యర్థులు ప్రచారం ఖర్చులు, నిబంధనలు పాటించాలి
ఈ ఎన్నికల్లో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులు ఒక్కొ అభ్యర్థి రూ. లక్ష వరకు ఖర్చు చేయాలనే నిబంధన ఉందన్నారు. కావున నిబంధనలు అతిక్రమించకుండా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు ఇవి గమనించాలని కోరారు.
ఇదీ చూడండి : 'ఆ ఊళ్లో అమ్మాయి పుడితే... పండుగ చేసుకుంటారు'