నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం లక్ష్మీపూర్‌లో దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు. గోపాల్‌ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా చంపేశారు. గొడ్డళ్లతో నరికి తలను వేరు చేశారు. తెల్లవారుజామున సమాచారం అందుకున్న నారాయణపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నారాయణ పేట సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ చంద్ర మోహన్ హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు. గ్రామంలో మృతుడికి ఎవరితోనూ విరోధం లేదని గ్రామస్థులు తెలిపారు.
గొడ్డళ్లతో తల నరికి... మెుండం వేరుచేసి.. - DOG SQUAD AT SPOT
నారాయణపేట జిల్లాలోని లక్ష్మీపూర్‌లో దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుడి తల, మెుండం వేరుచేసి భయోత్పాతం సృష్టించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో పరిశీలిస్తున్నారు.
నారాయణపేట జిల్లాలో ఘోర హత్య
Last Updated : Apr 20, 2020, 8:29 PM IST
TAGGED:
Vakthi Daruna Hatya